logo

ఘనంగా దొడ్డి కొమరయ్యకు నివాళులు అర్పించిన జే ఏ సీ బీసీ నాయకులు

నల్లగొండ vbs న్యూస్:- ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలో అమరవీరుల స్థూపం దగ్గర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతి కార్యక్రమం ఘనంగా నివాళులర్పిస్తూ బీసీ జేఏసీ నాయకులు డివిజన్ యాదవ్ సంగం కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, మలికంటి వెంకటయ్య మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు, కుమ్మరి కుంట సుధాకర్, చారి, జ్వాలా సురేష్ యాదవ్, నాయుడు, గంగరాజు, అంజి యాదవ్, తదితరులు పాల్గొన్నారు..

0
0 views